CPI party | పేద ప్రజల పక్షాన నిలబడేది ఎర్రజెండాయే

CPI party | పేద ప్రజల పక్షాన నిలబడేది ఎర్రజెండాయే
- ఓట్ల కోసం రకరకాల రంగుల పార్టీలు మీ ముందుకు వస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త
CPI party | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల వ్యాప్తంగా సీపీఐ పార్టీ సర్పంచి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మర్కోడు ఆళ్లపల్లి అనంతొగు మేజర్ పంచాయతీ లతో పాటు పల్లె గ్రామపంచాయతీల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించడం జరిగిందని భద్రాద్రి జిల్లా సీపీఐ కార్యదర్శి షేక్ సాబీర్ పాషా అన్నారు. ఈ రోజు పలు పంచాయతీలలో సీపీఐ పార్టీ అభ్యర్థులు మేస్సు మమత, వజ్జ పగడయ్య, స్వరూప, ఉమా, రాజేందర్, బుచ్చయ్యదొర, శ్రీరామ్, వెంకటలక్ష్మి, కాంతలు ఎల్లవేళలా మీగ్రామల్లోని పంచాయితీ వారీగా ప్రజలతో వెన్నంటిఉండి ప్రజల సమస్యల పక్షాన పోరాటాలు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఎర్రజెండా పార్టీల ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.
మండలంలోని రంగురంగుల పార్టీల నాయకులు పుట్టగొడుగుల్లా కొత్తగా వెలుస్తున్నారని ఆ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవసరానికి వాడుకుంటూ తదుపరి మీ సమస్యలు పరిష్కారం చూపడంలో విముఖుత చూపుతారని గుర్తుచేశారు. ఐదేళ్లకొకసారి సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం సర్వసాధారణం. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని ప్రజలకు సీపీఐ ఆధ్వర్యంలో అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగిందన్నారు. స్థానిక నాయకుల ఆధ్వర్యంలో స్థానిక సమస్యలు అభివృద్ధి సహాయ సహకారం అందించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో మండల ప్రజలు ఓటర్ మహాశయులు ఆలోచించి సీపీఐ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి అత్యధికంగా కోట్ల మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రేసు ఎల్లయ్య,కొమరం హనుమంతరావు, కాంతారావు, పగడయ్య, కృష్ణయ్య, వెంకటలక్ష్మి, ఇమ్మానుయేల్, లాజర్, సతీష్, షేక్ రహీం, మద్దెలవెంకటేశ్వర్లు, శివ, నరెడ్ల శివ, మెస్సు మమత, దీకొండ మల్లేష్, కుంట సహదేవ్, తాళ్లపల్లి రమేష్, తాళ్లపల్లి శ్రీనివాస్, కసనబోయిన నరేష్ ,రెడ్డిమల్ల నరేష్,సమ్మయ్య, కండే రాంబాబు, హరీష్, శ్రీరామ్ సమ్మయ్య, గోగ్గల బుచ్చయ్యదొర, తదితరులు పాల్గొన్నారు.
