CPI | నిజాయితీ ప‌రుల‌ను ఎన్నుకోవాలి…

CPI | నిజాయితీ ప‌రుల‌ను ఎన్నుకోవాలి…

CPI | జనగామ, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో నిజాయితీపరులైన ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్న వారిని ఎన్నుకోవడం ద్వారా గ్రామ అభివృద్ధి జరుగుతుందని మాజీ శాసనసభ్యులు, సీపీఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజారెడ్డి అన్నారు.

ఈ రోజు సీపీఐ జిల్లా కార్యాలయం గబ్బెట గోపాల్ రెడ్డి(Gabbeta Gopal Reddy) భవన్లో జువారి రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ.. సిపిఐ కార్యకర్తలు ప్రజాసేవకు అంకితమై ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీని వదలకుండా ప్రజాసేవ కాంక్షితమై పనిచేస్తున్న సీపీఐ అభ్యర్థులను సర్పంచులుగా, వార్డు మెంబర్లు(Ward Members)గా మెజార్టీతో గెలిపించాలనీ కోరారు.

డ‌బ్బుల‌కు విలువనిస్తే ఐదు సంవత్సరాలు ఏమీ అడగకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుందని, మన ఓటు హక్కు విలువ తెలుసుకోవాలని, డబ్బు రాజకీయాలు కొందరికె ఉపయోగపడతాయని, చట్ట సభల్లో సామాన్యులకు అవకాశం లేకుండా చేస్తున్నాయని తెలుసుకొని ప్రజలంతా డబ్బు రాజకీయాలను వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు అందుబాటులో ఉండి అనునిత్యం మీ కొరకు పని చేస్తున్న సిపిఐ, వామపక్ష అభ్యర్థుల(CPI, Left candidates)తో పాటు నిజాయితీపరులను ఎన్నుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యురాలు పాతురు సుగుణమ్మ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శిలు ఆది సాయన్న, ఆకుల శ్రీనివాస్, జిల్లా నాయకులు జీడి ఎల్లయ్య, కావటి యాదగిరి, పాతూరు ప్రశాంత్, రావుల సదానందం, సోమయ్య , భువనగిరి కుమారస్వామి, మోతే శ్రీశైలం, సముద్రాల రాజు, చామకూర యాకూబ్, మాలోతు సీతారాం, గూగులోత్ సఖి, నాయక్, చెల్లోజు మల్లేశం, బంటు పాండు, ఎండి యూనస్, విజయ పండుగ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply