అన్ని వసతులతో నూతన కోర్టు భవన సముదాయం

అన్ని వసతులతో నూతన కోర్టు భవన సముదాయం

  • కక్షిదారులకు సత్వర న్యాయం సౌలభ్యాలు
  • రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్
  • సిరిసిల్లలో నూతన కోర్టు నిర్మాణానికి భూమి పూజ

సిరిసిల్ల, ఆంధ్రప్రభ : కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని వసతులతో నూతన కోర్టు భవన సముదాయాలు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్ తెలిపారు. సిరిసిల్లలో సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.81 కోట్ల 60 లక్షల వ్యయంతో 12 రకాల న్యాయస్థానాలు సెల్లారొ పాటు టెన్ ప్లస్ టు శైలిలో నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించగా, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన లో పాల్గొనగా, సిరిసిల్లలో హైకోర్టు న్యాయమూర్తి కం జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ తుకారాంజీ, జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ వి జయసేన్ రెడ్డి, జస్టిస్ నందికొండ నర్సింగరావు, జస్టిస్ ఈవి వేణుగోపాల్, జస్టిస్ పుల్లా కార్తీక్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్వ మత ప్రార్థనలు చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. వర్చువల్ విధానంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరిష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. నూతన కోర్టు భవన సముదాయం అన్ని కోర్టుల నిర్వహణకు సరిపోయేలా ఉంటుందని వెల్లడించారు. నూతన కోర్టులో మౌలిక వసతులతోపాటు తగినంత సిబ్బంది ఉండాలని సూచించారు. సిరిసిల్ల జిల్లాకు భౌగోళికంగా, పరిపాలన పరంగా ప్రాముఖ్యత ఉందని, వ్యవసాయం జీవనోపాధితో అభివృద్ధి చెందుతున్న జిల్లా అని పేర్కొన్నారు.

ఇక్కడ చేనేత పరిశ్రమ ఎంతో ప్రసిద్ధి పొందిందన్నారు. నూతన కోర్టు భవన సముదాయంతో కోర్టుకు వచె కక్షి దారులకు సత్వర న్యాయం లభించాలని, ఈ దిశగా న్యాయవాదులు, న్యాయ మూర్తులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. జిల్లా కోర్టులో 13 వేల కేసులు పైగా కేసులు ఎండింగ్లో నున్నట్లు తెలిపారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

న్యాయ వ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం

నూతన కోర్టు భవన నిర్మాణం ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే కొత్త అధ్యాయానికి నాందిగా నిలుస్తుందని హైకోర్టు న్యాయమూర్తి కం జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ తుకారాంజీ పేర్కొన్నారు. రాజ్యాంగం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రతి పౌరుడికి సామాజిక న్యాయం అందేలా న్యాయవ్యవస్థ పని చేయాలన్నారు.

ప్రతి పౌరుడు న్యాయస్థానాన్ని ఆశతో, నమ్మకంతో ఆశ్రయించేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతన కొ ర్టు భవనం నిర్మాణం ద్వారా మౌలిక సదుపాయాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజలకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందేలా అవకాశం ఏర్పడుతుందని వివరించారు. సామాజిక న్యాయం, న్యాయ పరిపాలన, సమానత్వం, నాణ్యమైన న్యాయ సేవలు అందేలా న్యాయమూర్తులు, న్యాయవాదులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బార్ సభ్యులు సత్యాన్ని వెలికితీసే బాధ్యతతో పని చేస్తూ ప్రజలకు న్యాయం అందేలా అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం హై కోర్టు న్యాయమూర్తులను జిల్లా కోర్టులు, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాధ్యులు, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే ఘనంగా సన్మానించారు.

Leave a Reply