couple victory | ఇద్దరూ.. ఇద్దరే

couple victory | ఇద్దరూ.. ఇద్దరే
.. కార్పొరేటర్లుగా గెలిచిన భార్యాభర్తలు
గోదావరిఖని ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో ఒక వార్డు నుండి గెలవాలంటేనే చాలా వ్యయ ప్రయాసాలకు ఓర్చు కోవడం తో పాటు ప్రజల మనసులు గెలిస్తేనే సాధ్యమవుతుంది. అయితే ఏకంగా కార్పొరేషన్ ఎన్నికల్లో భార్యాభర్తలు విజయం సాధించడం విశేషం. అది కూడా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా ఇద్దరు భార్యాభర్తలు భారత రాష్ట్ర సమితి రెండు డివిజన్లో కార్పోరేటర్లుగా గెలవడం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంచలనగా మారింది. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి నుండి 58వ డివిజన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మేకల సమ్మయ్య, ఆయన భార్య మేకల శారద 60వ డివిజన్ లో పోటీ చేశారు. ఇద్దరికీ ఇద్దరూ ఓడిపోతారని విపరీతంగా ప్రచారం జరిగింది. అనూహ్యంగా శుక్రవారం జరిగిన కౌంటింగ్ లు భార్యాభర్తలు మేకల శారద మేకల సమ్మయ్యలు విజయం సాధించారు. భార్యాభర్తల విజయంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి పోగా సింగరేణి ప్రాంతంలో చర్చ నియంశంగా మారింది.
