ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

  • చావుబతుకుల్లో ప్రియురాలు


జనగామ : గడ్డి మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన జనగామ జిల్లా (Janagama district) స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో ప్రియుడు అన్వేశ్ (26) అక్కడికక్కడే మృతి చెందగా.. ప్రియురాలు పావని ఎంజీఎంలో చికిత్స పొందుతోంది.

ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హన్మకొండ జిల్లా (Hanmakonda District) ధర్మసాగర్ మండలానికి చెందిన ఆ యువతిని వివాహం చేసుకోవడానికి పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Leave a Reply