అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు
డ్రైవర్లకు, కూలీలకు కౌన్సిలింగ్ చేసిన ఎస్ఐ సతీష్
చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ నిబంధనల ప్రకారం మండలంలోని వాగుల నుండి ఇసుక రవాణా చేయాలని, అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ అన్నారు. బుధవారం మండలంలోని కాల్వపెల్లి మానేరు ఇసుక క్వారీ వద్ద ఇసుక లోడింగ్ చేసే కూలీలు, ట్రాక్టర్ యజమానులకు, డ్రైవర్లకు ఎస్సై సతీష్ పలు సూచనలు జారీ చేశారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే ట్రాక్టర్లకు ఇసుక లోడింగ్ చేయాలని. నెంబర్ ప్లేట్ తప్పనిసరి నెంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక పోయరాదన్నారు. ట్రాక్టర్ యజమానులు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్లు, ఇన్స్యూరెన్స్ కలిగి ఉండాలని,డ్రైవర్ల వద్ద చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, మైనర్లు ఎవరైనా ట్రాక్టర్ నడిపినట్లు తెలిస్తే, సదరు వాహన యజమానులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు , ప్రభుత్వ నిబంధనల అమలుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్సై సతీష్ కోరారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ బుర్ర రంజిత్, కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు పాల్గొన్నారు
