Council | గందరగోళం

Council | గందరగోళం

Council | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుమల లడ్డూ (Tirumala Laddu) కల్తీ ఆరోపణలపై రాష్ట్ర శాసన మండలి (Legislative Council )లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రసాద నాణ్యతపై పూర్తి స్థాయి నివేదిక విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి, శనగపిండి వంటి ముడి పదార్థాల నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేస్తూ స్వతంత్ర విచారణ జరపాలని కోరారు.

దీనికి స్పందించిన ప్రభుత్వ పక్షం సభ్యులు కల్తీ ఆరోపణలు రాజకీయ ఉద్దేశ్యాలతో చేస్తున్నవేనని విమర్శించారు. అన్ని ముడి పదార్థాలు ప్రమాణాల ప్రకారం కొనుగోలు చేసి, నాణ్యత పరీక్షలు (Quality tests) నిర్వహించిన తర్వాతే వినియోగిస్తామని తెలిపారు. అవసరమైతే నమూనాలను మళ్లీ పరీక్షించడానికి సిద్ధమని కూడా స్పష్టం చేశారు.

ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభలో నినాదాలు వినిపించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా (tensen situation ) మారడంతో సభను కొంతసేపు వాయిదా వేయాల్సి వచ్చింది. తిరుమల లడ్డూ భక్తుల విశ్వాసానికి ప్రతీక కావడంతో ఈ అంశం రాజకీయంగా కూడా వేడెక్కింది. ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడిస్తామని హామీ ఇవ్వగా, ప్రతిపక్షం పారదర్శక విచారణ జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపింది.

Leave a Reply