సిసిఐ నిబంధనలతో చిక్కులు

సమస్యలపై కరువైన స్పందన
తెలంగాణ కాటన్ మిల్లర్డ్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోయేషన్ నిర్ణయం


(వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్ర ప్రభ) : కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సి సి ఐ) నిబందనలతో పత్తి కొనుగోళ్ళల్లో ఎల్ 1,ఎల్ 2,ఎల్ 3 అలాట్మెంట్ వలన అసమతుల్య అలాట్మెంట్ జరిగి చాలా మిల్లులు మూతపడే పరిస్థితులు నెలకొంటున్న పరిస్థితులను పరిష్కరించాలన్న విజ్ఞప్తులపై స్పందన కరువైందని తెలంగాణ కాటన్ మిల్లర్డ్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోయేషన్ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి (Bommineni Ravinder Reddy) విమర్శించారు.

సిసిఐ చర్యలతో పాటు కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్ల (Cotton purchases) లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కారించాలని గత నెల 30న, ఈనెల 2న తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా సిసిఐ అధికారులను సమస్యల పరిష్కారించాలని చేసిన వినతిపత్రాలు ఎటువంటి స్పందన రాలేదన్నారు. ఈ కారణంగా ఈనెల 6 నుండి నిరవధికంగా తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోళ్ళను నిలిపి వేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రెడ్డి ప్రకటించారు.కాటన్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఇండస్ట్రీస్ యజమానులు, ట్రేడర్స్ అంతా సంఘటితంగా ఉండి సమస్యలు పరిష్కారమయ్యే వరకు పత్తి కొనుగోళ్ళు చేయడం బంద్ చేద్దామని పిలుపునిచ్చారు.

సిసిఐ నిబంధనలు,కపాస్, కిసాన్ యాప్ వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలు, పత్తి కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులపై తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ కార్యవర్గం సమావేశంలో చర్చించమన్నారు. సర్కార్ నుండే కాక సిసిఐ నుండి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడం వల్లే, విధిలేని పరిస్థితుల్లో ఈనెల 6 నుండి పత్తి కొనుగోళ్ళను నిరవధికంగా నిలిపి వేస్తున్నట్లు. అసోయేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply