ప్రపంచంలోనే బీజేపీ బలపడింది..

ప్రపంచంలోనే బీజేపీ బలపడింది..
బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అత్యంత శక్తివంతమైన రాజకీయ పార్టీగా బలపడిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హసన్ పర్తి 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ అన్నారు. హన్మకొండ.. కరీంనగర్ ప్రధాన రహదారిలోని హసన్ పర్తి లో మండల బీజేపీ అధ్యక్షులు మారం తిరుపతి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా ర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శివకుమార్ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ 14 కోట్లకు పైగా సభ్యత్వం కలిగిన మహా శక్తిగా ఎదిగిందని పేర్కొన్నారు.
కేవలం రెండు లోక్‌సభ స్థానాల నుండి ప్రారంభమైన పార్టీ, నేడు దాదాపు 300 స్థానాలకు ఎదిగి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు రాబోయే ఎన్నికల్లో 4వ సారి సైతం భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.రాబోయో కార్పొరేషన్ ఎన్నికల్లో 66వ డివిజన్ ను బీజేపీ కైవశం చేసుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, మండల ప్రధాన కార్యదర్శి చెల్పూరి శంకర్, ఉపాధ్యక్షులు రఘుపాల్ రెడ్డి, కార్యదర్శి దాది మధుసూదన్, దాట్ల సునీల్, నాయకులు గంట సత్యం, దాసరి రాజు, చకిలం రాజేశ్వరరావు, పెద్దమ్మ శ్రీనివాస్, మట్టెడ సుమన్, మారం కుమారస్వామి, శ్రీనివాస్,కందుకూరి శ్రీకాంత్, ఇమ్మడి కరుణాకర్,గొర్రె చిన్న కుమార్, శ్రీకాంత్,కందగట్ల కుమారస్వామి, నంద రవితేజ తదితరులు పాల్గొన్నారు.
