Corporation | పేద కమ్మ కుటుంబాల అభ్యున్నతే లక్ష్యం..

Corporation | పేద కమ్మ కుటుంబాల అభ్యున్నతే లక్ష్యం..

  • కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి

Corporation | విజయవాడ, ఆంధ్రప్రభ : కమ్మ సామాజిక వర్గంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడమే కార్పొరేషన్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి స్పష్టం చేశారు. తనను కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌(Minister Nara Lokesh)లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలోనే గాంధీనగర్ లో ఉన్న ప్రెస్ క్లబ్లో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి సూచనలు, లోకేష్ సలహాల మేరకు ప్రభుత్వం నుండి కార్పొరేషన్‌కు వచ్చే ప్రతి రూపాయిని అట్టడుగున ఉన్న పేద కమ్మ కుటుంబాల అభ్యున్నతి కోసం మాత్రమే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన కాకతీయ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

Corporation |ఉపాధి, విద్యకు ప్రాధాన్యం…

పేద కమ్మ కుటుంబాలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా సబ్సిడీతో కూడిన రుణాలు అందించనున్నట్లు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చౌదరి తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా జాబ్ మేళా(Job Mela)లు నిర్వహిస్తామని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే పేద విద్యార్థుల కోసం మూడు ప్రాంతీయ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాయలసీమ ప్రాంతానికి తిరుపతి, కోస్తా ఆంధ్రకు విజయవాడ, ఉత్తరాంధ్రకు విశాఖపట్నం కేంద్రాలుగా ఈ స్టడీ సర్కిల్స్ పనిచేస్తాయని వివరించారు.

Corporation |కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు..

బ్రాహ్మణ కార్పొరేషన్ తరహాలో కమ్మ కార్పొరేషన్‌లో కూడా ఒక కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చౌదరి తెలిపారు. దీని ద్వారా పేద విద్యార్థుల చదువులకు, ఇతర ఆర్థిక అవసరాలకు తోడ్పాటు అందించవచ్చని పేర్కొన్నారు. ఈ అంశంపై త్వరలో ముఖ్యమంత్రిని కలిసి అనుమతి కోరనున్నట్లు తెలిపారు.

Corporation |బాధ్యత మరింత పెరిగింది…

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లభించిన భారీ స్పందన తనపై మరింత బాధ్యతను పెంచిందని కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చౌదరి తెలిపారు. సమాజంలో వెనుకబడిన కమ్మ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి నూతులపాటి నాగభూషణం, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు నాగూర్, యువత నాయకులు ఉలాస శివ, త్రిపాఠి రాజా, కాటూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply