కూలీ, వార్ 2 బుకింగ్స్ ప్రారంభం !

స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రేక్షకులను అలరించేందుకు రెండు భారీ బడ్జెట్ సినిమాలు *‘కూలీ’ (Coolie), *‘వార్ 2’ (War 2)** సిద్ధంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే బుకింగ్స్ హాట్‌కేకుల్లా అమ్ముడవుతుండగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. చివరకు ఆ వేచి చూసే సమయం ముగిసింది.
తెలంగాణలో బుకింగ్స్ ప్రారంభం
ఈరోజు (మంగళవారం) సాయంత్రం నుంచి బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్‌లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. టికెట్ ధరల్లో తెలంగాణలో ఎలాంటి పెంపు లేదు. సింగిల్ స్క్రీన్‌లలో రూ.175, మల్టీప్లెక్స్‌లలో రూ.295 ధరలకు టికెట్లు లభిస్తున్నాయి. మార్నింగ్ షోకు ముందు కేవలం ఒకే ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి లభించింది. అనుమతుల ప్రకారం ఈ స్పెషల్ షో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రదర్శించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి
‘కూలీ’ విడుదల రోజునే ఉదయం 5 గంటలకు అదనపు షోకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్‌లలో రూ.15 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ రేట్లు ఆగస్టు 14 నుంచి 23 వరకు అమల్లో ఉంటాయి.
