సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మోస్ట్ అవెయిటెడ్ మూవీ “కూలీ” ట్రైలర్ భారీ అంచనాల మధ్య విడుదలైంది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ మాయాజాలంతో ఈ ట్రైలర్ విజువల్స్ పరంగా, బీజీఎమ్ పరంగా అభిమానులను ఫిదా చేస్తోంది. ట్రైలర్‌లో రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, స్టైల్ అన్నీ కలిపి మాస్ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.
ఇక ట్రైలర్‌లో అక్కినేని నాగార్జున ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆయన పాత్ర, లుక్, స్టైల్ చూస్తుంటే… ఇది పూర్తిగా కొత్త నాగ్‌ను చూసిన ఫీలింగ్ ఇస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్సులు, పాన్ ఇండియా వాల్యూ కలిగిన స్టార్స్ తో సినిమా పట్ల ఆసక్తి మరింత పెరిగింది.
ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకు మరో స్పెషల్ ఎలిమెంట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి ఇప్పటికే విడుదలైన మోనికా, పవర్ హౌస్ పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉన్నాయి..
స్టార్ కాస్టింగ్ విషయానికి వస్తే రజినీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమిర్ ఖాన్, శృతి హాసన్, రెబా మోనికా, సత్యరాజ్, కిషోర్ కుమార్, సౌబిన్ షాహిర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో రజినీకాంత్ “దేవా” పాత్రలో అదిరిపోయే మాస్ లుక్‌లో దర్శనమివ్వబోతున్నారు.