జనగణన విధుల కేటాయింపుపై వివాదం

జనగణన విధుల కేటాయింపుపై వివాదం
- సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలంటూ వినతి
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : జనగణన–2027 విధుల నియామకంలో సీనియర్ ఉపాధ్యాయులను పక్కనబెట్టి జూనియర్ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని పలువురు ఉపాధ్యాయులు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్‌యూటీఎఫ్) దృష్టికి తీసుకురావడంతో వివాదం తలెత్తింది.
దీనిపై స్పందించిన టీఎస్‌యూటీఎఫ్ నల్లబెల్లి మండల, జిల్లా కమిటీ సభ్యులు వెంటనే మండల తహసీల్దార్, మండల విద్యాధికారి (ఎంఈఓ)లను కలిసి వినతిపత్రం సమర్పించారు. విధుల కేటాయింపులో ఉన్న లోటుపాట్లను సరిదిద్దాలని, పారదర్శకత పాటిస్తూ సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఎటువంటి అన్యాయం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎడవెల్లి రాజిరెడ్డి, జిల్లా కోశాధికారి సయ్యద్ అబ్దుల్ రవూఫ్, నాయకులు నల్లెల యాదగిరి, తేజావత్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
