దొమ్మేటి వెంకటరెడ్డికి ఘన నివాళులు…

దొమ్మేటి వెంకటరెడ్డికి ఘన నివాళులు…

విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా అదనపు కమిషనర్లు డాక్టర్ డి చంద్రశేఖర్, ఎ.రవీంద్రరావు, దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి సిబ్బంది తో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇంచార్జీ కమిషనర్ డాక్టర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ, దొమ్మేటి వెంకటరెడ్డి సమాజ సేవలో విశిష్ట స్థానం సంపాదించిన మహనీయులని పేర్కొన్నారు.

ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఘననివాళులు అర్పించారు. శెట్టిబలిజ సమాజానికి విద్య, ఐక్యత, గౌరవం తీసుకువచ్చిన గొప్ప సామాజిక సంస్కర్తగా ఆయన గుర్తింపు పొందారు. శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని స్థాపించి వారి అభ్యున్నతికి విశేషంగా కృషిచేశారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని అన్నారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, ఎస్టేట్ ఆఫీసర్ ఎ.శ్రీధర్, పర్యవేక్షణ ఇంజనీర్( వర్క్స్) చంద్రశేఖర్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మల్యాద్రి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డి. హరీష్, బయాలజిస్ట్ వి కామేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply