మా చదువులకు సహకరించండి…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా కేంద్రానికి ఊట్కూర్ మండల(Ootkur Mandal) కేంద్రం నుండి విద్యార్థులు కళాశాలలకు, పాఠశాలలకు విద్యను అభ్యసించేందుకు ప్రతినిత్యం వందలాది మంది విద్యార్థులు వెళుతున్నారు. సకాలంలో బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్యకు బీజేపీ(BJP) జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి, ఊట్కూర్ మాజీ సర్పంచ్ ఎం భాస్కర్ విద్యార్థులతో కలిసి ఈ రోజు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లా కేంద్రం ఊట్కూర్ మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో విద్యార్థులు చదువుకునేందుకు నారాయణపేట జిల్లా(Narayanapet district) కేంద్రానికి ప్రతినిత్యం ఉదయం వెళుతున్నారనీ, బస్సులు సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బస్సులు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు ఊట్కూర్ బస్టాండ్(Bus Stand) వద్ద బస్సులు నిలిపి నిరసన చేపట్టినట్లు తెలిపారు.
బస్సులు సకాలంలో నడపాలని గతంలో రాస్తారోకో ఆందోళనలు చేపడితే ఆర్టీసీ అధికారులు రెండు మూడు రోజులు సకాలంలో బస్సులు నడిపి మళ్లీ రద్దు చేయడం వల్ల సమస్య జటిలమైందని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఉదయం, సాయంత్రం విద్యార్థుల సౌకర్యార్థం(convenience of students) సమయానికి బస్సులు నడిపి వారి చదువుకు సహకరించాలని కోరారు. అందుకు ఆర్టీసీ డీఎం లావణ్య మాట్లాడుతూ.. విద్యార్థులకు సమస్య తలెత్తకుండా ఉదయం, సాయంత్రం బస్సులు సమయానికి నడిపే విధంగా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

