నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : ఇందిరమ్మఇండ్ల నిర్మాణపు పనులను త్వరితగతిన(Quickly) పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. జిల్లా లోని ఆత్మకూరు మండలం తుక్కాపురం, కూరెళ్ల గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల(Indiramma’s house) నిర్మాణ పనులను పరిశీలించారు.
గ్రామంలో ఇంళ్ల మంజూరు, నిర్మాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బేస్మెంట్ లెవల్(basement level), లెంటల్ లెవల్ వరకు పూర్తి అయిన వారికి లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ ఫోటో కాప్చర్ చేయనివి ఉంటే ఆలస్యం(delay) చేయకుండా వెంటనే చేయాలని హౌసింగ్ ఏఈలను ఆదేశించారు.



