మల్లాయి చిట్టూరు రహదారి నిర్మాణ పనులు ప్రారంభం

ఘంటసాల, ఆంధ్రప్రభ : అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో గత ఐదు సంవత్సరాలుగా రహదారి గోతులు పడి ఇబ్బందులు పడిన ప్రజలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కోటి రూపాయల నిధులతో పూషడం నుంచి మల్లాయి చిట్టూరు వరకు నూతన రహదారి నిర్మాణ పనులు శనివారం ప్రారంభించారు. గ్రామపంచాయతీ సర్పంచ్ ఆవుల రేవతి, నీటి సంఘ అధ్యక్షులు ఆవుల ధర్మ వెంకట నరసయ్యలు కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ధర్మ వెంకట నరసయ్య మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఎమ్మెల్యే చొరవతో రహదారి నిర్మాణానికి అడుగులు పడ్డాయని తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మండలి వెంకట్రామ్ లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతల నాగబాబు, వార్డు మెంబర్ నరహరశెట్టి విజయరాణి, పిఆర్ డిఈ పగడాల సురేష్, ఏఈ బ్రహ్మ నందబాబు, వసంతరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
