RIVER | నది తీరాన ఆలయాల నిర్మాణం

RIVER | నది తీరాన ఆలయాల నిర్మాణం

5 కోట్లతో సమ్మక్క జాతర ప్రాంగణాల అభివృద్ధి

RIVER | గోదావరిఖని, ఆంధ్రప్రభ :  శ్రీరామచంద్ర ప్రభు నడయాడిన రామగుండం (Ramagundam) పారిశ్రామిక ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 108 అడుగుల పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ముందస్తుగా అంజనాద్రి గుట్టపై సత్యనారాయణ వ్రత మహోత్సవం తర్వాత మీడియాతో మాట్లాడారు. తనను నమ్మిన ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేయడం నా కర్తవ్యం అన్నారు. పరిశ్రమలకు పుట్టినిల్లుగా పిలువబడుతున్న రామగుండం గోదావరి తీర ప్రాంతం ఆధ్యాత్మికత విరజిల్లేందుకు తాను శక్తికి మించి కృషి చేస్తానని తెలిపారు.

ఇదే గుట్టపై ఎత్తైన మహాశివుని విగ్రహంతో పాటు దుర్గామాత అమ్మవారు, మానస దేవి, కామాక్షి అమ్మవారి ఎత్తైన విగ్రహాల ప్రతిష్టాపన చేస్తామన్నారు.రాముని గుండాల గుట్ట పరిసర ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంతోపాటు ఊహించని రీతిలో ప్రత్యేక పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సన్నహాలు చేస్తున్నట్లు మక్కన్ సింగ్ (McCann Singh) పేర్కొన్నారు. అంతర్గాం మండలం మోర్ మోర్, ఎల్లంపల్లి , గోలివాడ నది తీరా ప్రాంతాల్లో గోదారి మాత ఆలయ నిర్మాణాలు చేపడతామన్నారు. గోదావరిఖని పట్టణంలోని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగాన్ని 5 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, గోలివాడ తక్కలపల్లి సమ్మక్క జాతర్ల ప్రాంతాలను కూడా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

రామగుండం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ ఈ ప్రాంతాన్ని పవిత్ర పుణ్యక్షేత్రాల నిలయంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ (MLA Raj Thakur) స్పష్టం చేశారు. అలాగే అతి త్వరలో రామగుండం ను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దానున్నామని తెలిపారు. సనాతన ధర్మంతో పాటు ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల మతాలను గౌరవిస్తూ వారి ఆలయాలను, మసీదులను కూడా అభివృద్ధి చేయడం తన బాధ్యతని మక్కన్ సింగ్ నొక్కి చెప్పారు.

గోదావరి నది తీరాన వేద పాఠశాల :

పవిత్ర గోదావరి నది తీరాన వేద పాఠశాల ను అతి త్వరలోనే ఏర్పాటు చేయడానికి సలహాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ తెలిపారు. ఈ ప్రాంతంలోని వేద పండితుల అభిలాష మేరకు వేద పాఠశాల (Vedic School) నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గోదావరి నది తీరాన ఒక ఎకరం స్థలంలో వేద పాఠశాల ఏర్పాటు చేస్తామని, అక్కడ పాఠశాల నిర్వహణకు సంబంధించి హాలు నిర్మాణం తన సొంత ఖర్చుతో చేపిస్తానని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Leave a Reply