మసీద్ అభివృద్ధికి రూ.2.60 లక్షలు విరాళం…

మసీద్ అభివృద్ధికి రూ.2.60 లక్షలు విరాళం…
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని పి నైనవరం గ్రామంలోని మసీద్ నిర్మాణానికి రూరల్ మండల వైసిపి నాయకులు రూ.2.60 లక్షల విరాళాన్ని శనివారం మసీద్ పెద్దలకు అందజేశారు. గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్, నియోజకవర్గ నాయకులు కొమ్మా కోటేశ్వరరావు సూచనల మేరకు మండల మాజీ వైస్ ఎంపీపీ జీతం శ్రీనివాసరావు రూ.50 వేలు. పి నైనవరం గ్రామ పార్టీ అధ్యక్షులు దావు వెంకటేశ్వరరావు రూ. 50 వేలు, నైనవరం గ్రామ సర్పంచ్ బట్ట సోమయ్య రూ.50 వేలు, గ్రామ మాజీ సర్పంచ్ దావు కోటేశ్వరరావు రూ. 10 వేలు, రూరల్ మండలం వైయస్సార్సీపి అధ్యక్షుడు అంగజాల హనుమాన్ రూ. 10 వేలు, తదితరులు నగదును మసీదు పెద్దలకు అందజేశారు.
పేదలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం అండగా ఉంటుందని మండల పార్టీ అధ్యక్షుడు అంగజాల హనుమాన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నాగిరెడ్డి, కాలకోటి బ్రహ్మానందరెడ్డి భీమవరపు శివరామిరెడ్డి, సందేటి చంద్రశేఖర్ బేతపూడి గోపికృష్ణ, శివయ్య, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
