పెద్దవూరలో ఘ‌ట‌న‌

పెద్దవూరలో ఘ‌ట‌న‌

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : న‌ల్ల‌గొండ జిల్లా(Nallagonda District)లో యూరియా కోసం రైతులు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు పెద్దవూర(Peddavoor) మండల కేంద్రంలోని పీఏసీఎస్‌(PACS) వద్ద యూరియా కోసం వందలాది మంది రైతులు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

క్యూలైన్ లలో ఉన్న రైతులను అదుపు చేసే క్రమంలో కానిస్టేబుల్ దేశా నాయక్(Desa Naik) ఓ రైతుపై చేయి చేసుకోవడంతో రైతులంతా పోలీసులకు(Police) ఎదురు తిరిగారు. క్యూలైన్లో ఒత్తిడికి తట్టుకోలేక ముగ్గురు మహిళలు స్పృహ కోల్పోయారు. దీంతో సాటి రైతులు ఆ మహిళలను పక్కకు తీసుకొచ్చి సపర్యలు చేయడంతో వారు కొనుకున్నారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల యూరియా(Urea) బస్తాల కోసం తాము అష్ట కష్టాలు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply