హైదరాబాద్ – పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (t pcc chief mahesh kumar goud ) పార్టీ జిల్లాల ఇంచార్జ్‌లకు ( district incharges ) సూచించారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఇంచార్జ్‌లను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నియమించారు. ఈ మేరకు నియమించిన 10 మంది ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్‌లతో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ (zoom meeting ) నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంచార్జ్‌ల విధి విధానాలను మీనాక్షి నటరాజన్ వెల్లడించారు. త్వరలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టాలని, ఈ నేపథ్యంలోనే వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించారు. .
ఇక జిల్లాల వారీగా ఇంచార్జ్‌లు..
1.సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీ చంద్ రెడ్డిని ఉమ్మడి ఖమ్మం జిల్లా . 2. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, నల్గొండ 3. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వరంగల్ 4. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మెదక్ 5. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, హైదరాబాద్ 6. పీఏసీ సభ్యుడు కుసుమ కుమార్, మహబూబ్ నగర్ 7. ఎంపీ అనిల్ యాదవ్ ఆదిలాబాద్ 8. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కరీంనగర్ 9. వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మత్ హుస్సేన్, నిజామాబాద్ 10. ఎస్ఏటీ చైర్మన్ శివసేన రెడ్డికి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్‌గా నియమించారు.