Telangana | దేశ అభ్యున్నతికి ఇందిరా గాంధీ ఎనలేని కృషి
Telangana | దండేపల్లి, ఆంధ్రప్రభ : దేశానికి, పేద ప్రజలకు ప్రధానిగా ఇందిరా గాంధీ (Indira Gandhi) ఎనలేని సేవలు చేశారని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు (Akkala Venkateshwarlu) ఇందిరాగాంధీ సేవలను కొనియాడారు. బుధవారం దండేపల్లి లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడాతూ… భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి (Prime Minister) గా ఎన్నికై దేశానికి ఎనలేని సేవలు చేసి, దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల, స్థలాలు, భూమి లేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ పచాయితీ రాజ్ సంఘటన జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, మాజీ ఎంపిటిసి లు ముత్యాల శ్రీనివాస్, కంది హేమలత సతీష్,కొంగల నవీన్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్ష కార్యదర్శులు సిరికొండ నవీన్,లక్కకుల సృజన్ పార్టీ సీనియర్ నాయకులు బోయిడి వెంగల్ రావు,కట్కూరి రాజన్న, బత్తుల రమేష్,గుర్రం గంగన్న తదితరులు పాల్గొన్నారు.

