ప్రజా ప్రభుత్వం తోనే పట్టణాభివృద్ధి

ప్రజా ప్రభుత్వం తోనే పట్టణాభివృద్ధి

భీంగల్ టౌన్, ఫిబ్రవరి 5 ( ఆంధ్రప్రభ) అధికార కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంతోనే భీమ్ గల్ పట్టణ అభివృద్ధి సాధ్యం అవుతుందని బాల్కోండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పేర్కొన్నారు. గురువారం భీమ్ గల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.భీంగల్ పట్టణ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునిల్ కుమార్ గారు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే అర్హులైన పట్టణ పేదలందరికీ రేషన్ కార్డులు వచ్చాయని అన్నారు.

గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వక ప్రజలను మోసం చేసిందని ఆయన అన్నారు. ఒక్క భీంగల్ పట్టణానికే 200 లకు పైగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసామని ఇప్పుడు ఆ ఇండ్లన్నీ నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. భీంగల్ పట్టణంలో తరువాత దశలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని అన్నారు. భీంగల్ పట్టణ అభివృద్ధిని గత ప్రభుత్వం పక్కన పెట్టిందని కానీ ఈ ప్రజా ప్రభుత్వం ప్రతి వార్డులో మురికి కాలువలు సిసి రోడ్ల నిర్మాణం కొరకు మరియు త్రాగునీటి సదుపాయం కొరకు 54 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని పనులన్నీ నిర్మాణ దశలో ఉన్నాయని అన్నారు.

భీంగల్ పట్టణంలో గల కేజీబీవీ పాఠశాలను 40 లక్షల రూపాయలతో మరమ్మతులు చేయించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కావున ప్రజలంతా స్వచ్ఛందంగా అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీ వెంటే నిలబడాలని అన్నారు. భీంగల్ మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని, మున్సిపల్ చైర్మన్ పగ్గాలు కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తే అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు.

భీంగల్ మున్సిపల్ ముఖ్యమంత్రి, పీసీసీ లకు బహుమానం

భీంగల్ మున్సిపల్ లో విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లకు బహుమతి గా ఇస్తామని రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలో భీంగల్ అభివృద్ధి పై చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. తప్పుడు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు.

భీంగల్ ప్రజలు పట్టణం అభివృద్ధి కొరకు ప్రజపాలన ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమం లో మినరల్ డెవోలోప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, కౌన్సిలర్ అభ్యర్థులు మల్లెల రాజశ్రీ, లక్ష్మణ్, నాగేంద్ర బాబు, శ్రీజ, సుంకరి సురేష్ సౌమ్య, కర్నె గంగయ్య, అనంత్ రావు, కోటగిరి బాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply