హస్తం గుర్తుకు ఓటెయ్యండి అందుబాటులో ఉంటా..

మంథని, ఆంధ్రప్రభ : హస్తం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ పార్టీ 7 వ వార్డ్ అభ్యర్థి జంబోజు శ్రీమతి సమయ పేర్కొన్నారు. ఆమె ప్రచారంలో అడగడున ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ తరఫున విజయం కైవసం చేసుకోబోతున్నారు. సమాజం పట్ల అవగాహన కలిగి ఉంది హస్తం గుర్తుకు ఓటెయ్యండి సేవకురాలిగా పనిచేస్తానని ఆమె తెలిపారు. 7 వ వార్డు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని, వార్డు లో ఉన్న ప్రతి సమస్య పై అవగాహన కల్గి వున్నాను..
ఆశతో కాదు ఆశయం కోసం పనిచేసే వారికి అవకాశం ఇవ్వండి అని అన్న ప్రచారంలో పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ప్రజలందరికీ ఆడబిడ్డల అందుబాటులో ఉంటానని ఆమె పేర్కొన్నారు. నిత్యం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ వార్డ్ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానని ఆమె తెలిపారు. అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కార్యచరణ చేపడతారని ఆమె పేర్కొన్నారు. మీ అందరిలో ఒక్కరినైనా నేను మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్న మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి ఆశీర్వదించాలని ఆమె వివరించారు.
