Congress party | వైరా యువ నాయకునితో..

Congress party | వైరా యువ నాయకునితో..
- బిఆర్ఎస్ నేత మంతనాలు..
- పార్టీలోకి ఆహ్వానిస్తూ..పదవి ఆఫర్..
- మారుతున్న రాజకీయ సమీకరణాలు..
- ప్రారంభమైన పార్టీ వలసల ప్రక్రియ..
Congress party | వైరా, ఆంధ్రప్రభ : వైరా మున్సిపాలిటీ ఎన్నికలను బిఆర్ఎస్ పార్టీతో పాటు ఖమ్మం జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి నేతృత్వంలో.. మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ నుండి భారీగా వలసలను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టమవుతుంది. అందుకు తార్కానమే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ రెండో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ వెళ్లి బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో జనాదరణ కలిగిన నాయకులకు బిఆర్ఎస్ పార్టీలోని వారి వారి సన్నిహితుల నుండి బంపర్ ఆపర్ ఇస్తూ.. బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు పావులు గదుపుతున్నట్లు తెలుస్తోంది. వైరాలోని కాంగ్రెస్ పార్టీ బలమైన సామాజిక వర్గానికి చెందిన బీసీ యువ నాయకుడు తో మంతనాలు జరిగినట్లు స్పష్టమైన సమాచారం.
యువ నాయకుడి సామాజిక వర్గానికి చెందిన ఖమ్మం బిఆర్ఎస్ నేత ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పార్టీలోకి రావాలంటూ.. ఆహ్వానిస్తూ మున్సిపల్ చైర్మన్, లేదా వైస్ చైర్మన్ ఆఫర్ కూడా ఇస్తూ మధ్యవర్తిత్వం వేయిస్తున్నట్లు తెలుస్తోంది.. ఏ ఏ నాయకులు ఏ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయంపై కూడా.. ప్రస్తుతం సందిగ్ధం నెలకొంది.. టిఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందో…లేదో వేచి చూడాల్సిందే..!
