హైదరాబాద్ – మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. . జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలోఈ ఎమ్మెల్యేలు సిఎంతో భేటి అయ్యారు.. ఈ సందర్బంగా రేవంత్ ను దుశ్శాలువతో సత్కరించారు..కాగా . ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో మాదిగ సామాజికి వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కు అవకాశం దక్కింది. ఆయనకు ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ లు, ట్రాన్స్ జెండర్స్ శాఖలను అప్పగించారు దీంతో అడ్లూరి లక్ష్మణ్ సహా పలువురు మాదిగ సామాజిక ఎమ్మెల్యేలు ఇవాళ సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలే యాదయ్యతో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి , జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Congress | మాకూ మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం .. రేవంత్ కు మాదిగ ఎమ్మెల్యేల థ్యాంక్స్
