హైదరాబాద్ – కరోనా కన్నా డేంజరెస్ వైరస్ కాంగ్రెస్ అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది క్రితం చెప్పింది.. ఇవాళ అక్షరాలా నిజమైందని అన్నారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్‌లో రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యితీసి పాతరేశారని విమర్శలు చేశారు. దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారని కేటీఆర్ మండిపడ్డారు.
గతేడాది 10శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు కేవలం ఒకే ఒక్కశాతం వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటన్నారు. మతిలేని ముఖ్యమంత్రి ఘోర తప్పిదాల వల్లే ఈ సంక్షోభమని అన్నారు. ప్రభుత్వ పెద్దల కమీషన్లు ఆకాశాన్ని అంటుతుంటే రాష్ట్ర రాబడులు మాత్రం కుప్పకూలడం క్షమించరాని నేరమని చెప్పారు. కేసీఆర్ పదేళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాసుకునే “చీకటి చరిత్ర” ఇదేనా.. అని కేటీఆర్ ప్రశ్నించారు.