Congress | అదే లక్ష్యంతో వచ్చాను – బీసు శ్రీకాంత్ గౌడ్..

Congress | అదే లక్ష్యంతో వచ్చాను – బీసు శ్రీకాంత్ గౌడ్..

Congress, మోత్కూర్, ఆంధ్రప్రభ : సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో అభివృద్ధి లక్ష్యంగా 9 వ వార్డులో కౌన్సిలర్ బరిలో దిగానని.. ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే.. వార్డ్ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి బీసు శ్రీకాంత్ గౌడ్ ఓటర్లను అభ్యర్ధించారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలిపిస్తే.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సామెల్ సహకారంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, త్రాగునీటికీ శాశ్వత పరిష్కారం, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.

యువకుడిగా తొలిసారిగా రాజకీయ పదవికై తాను పోరులో నిలిచానని.. ఈ ఒక్కసారి జామచెట్లబావి, కొండాపురం, మంగలి గడ్డ, గడి బజార్ ప్రజలు అవకాశం ఇచ్చి.. చెయ్యి గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వార్డు అభివృద్ధి లక్ష్యంగా కృషి చేయడంతో పాటు.. అన్ని రంగాల్లో వార్డును అభివృద్ధిపరిచి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నారు.

Leave a Reply