నిజామాబాద్ ప్రతినిధి, జూలై 11(ఆంధ్రప్రభ): ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేదోడి సొంతిల్లు కలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను అందజేసి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపిందని నిజామాబాద్ రూరల్ (Nizamabad Rural) ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి (MLA Dr. Bhupathi Reddy) అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్నింటినీ అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే (Public welfare) ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే అన్నారు.
శుక్రవారం నిజామాబాద్ రూరల్ నియోజ కవర్గంలోని మల్కాపూర్ (ఏ) గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను రూరల్ ఎమ్మె ల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు రూరల్ ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మల్కాపూర్(ఏ) గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ ఎమ్మె ల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పారదర్శకంగా నిర్వహిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయి.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతల్లో చూపించిందన్నారు. 10సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభు త్వం ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప అభివృద్ధి ఏమి చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో అభివృద్ధి చేసి చూపిస్తుందన్నారు. ఉచిత కరెంట్ బిల్లు, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇల్లు ఇలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు.ఈ సమా వేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు బాగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.