పట్టణంలోని 21వ వార్డులో కాంగ్రెస్ విస్తృత ప్రచారం

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 21 వార్డులో 21వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సూదమల్ల రమేష్ విస్తృత ప్రచారం నిర్వహించారు. శుక్రవారం రోజు పట్టణంలోని 21వ వార్డులోని జయ డీలక్స్ వీధిలో ఓటర్లను కలుస్తూ సమస్యలు తెలుసుకుని శాశ్వత పరిష్కారం చేస్తామని కాంగ్రెస్ పార్టీ 21 వ వార్డు అభ్యర్థి సూదమల్ల రమేష్ ఓటర్లకు హామీ ఇవ్వడం జరిగింది. అభ్యర్థి రమేష్ మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆశీస్సులతో 21 వ వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. వార్డులోని ఓటర్లు అవకాశమిచ్చి అత్యధిక మెజార్టీతో అభ్యర్థి సూదమల్ల రమేష్ విజ్ఞప్తి చేశారు. అభ్యర్థి రమేష్ వెంట ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ జాఫర్ రిజ్వి, ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి, వార్డు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave a Reply