Congress | ఏఐసీసీ పరిశీలకులుగా ఏపీ, తెలంగాణ నేతలు

  • మధ్యప్రదేశ్‌కు గిడుగు రుద్రరాజు, ప్రసాద్‌, సంపత్‌ కుమార్‌
  • హర్యానాకు వంశీచంద్‌ నియామకం

ఆంధ్రప్రభ బ్యూరో : ఏఐసీసీ పరిశీలకులుగా ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలకు అవకాశం దక్కింది. మధ్యప్రదేశ్‌, హర్యానాలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుల ఎంపికకు ఏఐసీసీ పరిశీలకులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నలుగురిని నియమించారు.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి గిడుగు రుద్రరాజు, సిరివెళ్ళ ప్రసాద్‌, తెలంగాణ నుంచి సంపత్‌ కుమార్‌, వంశీ చంద్‌ రెడ్డిని పరిశీలకులుగా నియమిస్తూ ప్రకటనను వెల్లడించారు.

మధ్యప్రదేశ్‌కు 50 మంది, హర్యానాకు 21 మంది ఏఐసీసీ పరిశీలకులను నియమించ‌గా… ఇందులో ఏపీ, తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు ముగ్గురు, హర్యానాకు ఒక్కరు పరిశీలకులుగా అవకాశం దక్కింది.

ఏపీ నుంచి సీడబ్ల్యూసీ సభ్యులుగా ఉన్న గిడుగు రుద్రరాజు, సిరివెల్ల ప్రసాద్‌లను మధ్యప్రదేశ్‌కు పరిశీలకులుగా ఎంపిక చేయగా, తెలంగాణ నుంచి ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న సంపత్ కుమార్‌కు అవకాశం లభించింది.అలాగే హర్యానాకు తెలంగాణ నుంచి వంశీ చంద్‌ రెడ్డిని పరిశీలకులుగా నియామించారు.

Leave a Reply