Congress | చౌటుప్పల్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్..

Congress | చౌటుప్పల్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్..
20 వార్డులలో అధికార కాంగ్రెస్ కు 13, బి ఆర్ ఎస్ కు 3, బిజెపి కి 3, సిపిఎం 1 స్థానం
Congress | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 20 కౌన్సిలర్ స్థానాలకు గాను 17వ స్థానం (కాంగ్రెస్) ఏకగ్రీవం కాగా మిగిలిన 19 కౌన్సిలర్ స్థానాలకు ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో పార్టీ మునుగోడు ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ విజయ డంకా మోగించింది. 19 స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ 13 స్థానాలను కైవసం చేసుకుని చౌటుప్పల్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగరవేసింది. బీఆర్ఎస్, సీపీఐయం పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ 3 స్థానాలలో బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు, ఒక స్థానంలో సిపిఎం అభ్యర్థి కౌన్సిలర్ గా విజయం సాధించారు. ఒంటరిగా పోటీ చేసిన బిజెపి అభ్యర్థులు మూడు స్థానాలలో విజయం సాధించారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులలో విజేతలు..
1వ వార్డు కొసనం రాకేష్ రెడ్డి (కాంగ్రెస్), తూర్పునూరి మల్లేశం (బీఆర్ఎస్) పై 269 ఓట్ల మెజారిటీ
2వ వార్డు పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య (బిజెపి), వల్లందాస్ స్వాతి (బీఆర్ఎస్) పై 3 ఓట్ల మెజారిటీ
3వ వార్డు పల్లె లావణ్య సురేష్ రెడ్డి (కాంగ్రెస్), రమణగోని దీపిక శంకర్ పై 34 మెజారిటీ
4వ ఊదరి యాదయ్య (బీఆర్ఎస్ ), ఇప్ప వెంకటేశం (కాంగ్రెస్) పై 156 ఓట్ల మెజారిటీ
5వ వార్డు కొయ్యడ శేఖర్ (బీఆర్ఎస్), కొండూరు ధర్మేందర్ (కాంగ్రెస్) పై 217 ఓట్ల మెజారిటీ
6వ వార్డు ఆలే శ్రీలత చిరంజీవి (బిజెపి), రావుల వసంత (కాంగ్రెస్) పై 203 ఓట్ల మెజారిటీ
7వ వార్డు కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్), కానుగు యాదమ్మ బాలరాజు (బిఆర్ఎస్) పై 2 ఓట్ల మెజారిటీ
8వ వార్డు బద్రి గాలయ్య (కాంగ్రెస్), చుక్క యాదయ్య (బీఆర్ఎస్) పై 197 ఓట్ల మెజారిటీ
9వ వార్డు మొగుదాల పావని రమేష్ గౌడ్ (కాంగ్రెస్), దండ అరుణ్ కుమార్ (సిపిఎం) పై 542 ఓట్ల మెజారిటీ
10వ వార్డు దేప రమ్య రాజు (కాంగ్రెస్), మసనం సంగీత (బిజెపి) పై 577 ఓట్ల మెజారిటీ
11వ గోశిక వినయ్ కుమార్ (కాంగ్రెస్), పోలోజు శ్రీధర్ బాబు (బిజెపి) పై 145 ఓట్ల మెజారిటీ
12వ పాక చిరంజీవి (కాంగ్రెస్), తాడూరి పరమేష్ (బీఆర్ఎస్) పై 227 ఓట్ల మెజారిటీ
13వ వార్డు బత్తుల వాణి విప్లవ్ కుమార్ (కాంగ్రెస్), చెవగొని స్వాతి శివకుమార్ (బిజెపి) పై 552 ఓట్ల మెజారిటీ
14వ వార్డు ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్ (కాంగ్రెస్), చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి (బిఆర్ఎస్) పై 403 ఓట్ల మెజారిటీ
15వ వార్డు గడ్డం ఇందిర రాజారత్నం (బిఆర్ఎస్), అంతటి విజయలక్ష్మి బాలరాజ్ (కాంగ్రెస్) పై 520 ఓట్ల మెజారిటీ
16వ వార్డు బత్తుల జయమ్మ దాసు (సిపిఎం), వెన్ రెడ్డి సంధ్యా రాజు (కాంగ్రెస్) పై 374 మెజారిటీ
17వ వార్డు చింతల ఉమామహేశ్వరి (కాంగ్రెస్) ఏకగ్రీవం
18వ వార్డు బుడ్డ సురేష్ (బీజేపీ), గుగులోతు అరుణ శంకర్ నాయక్ (కాంగ్రెస్) పై 509 ఓట్ల మెజారిటీ
19వ వార్డు పిల్లలమర్రి మధుసూదన్ (కాంగ్రెస్), రమణగోని శంకర్ (బిజెపి) పై 50 ఓట్ల మెజారిటీ
20వ వార్డు ఎండి హన్ను (కాంగ్రెస్), ఎండి అత్తార్ పాషా (బిఆర్ఎస్) పై 327 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
