congress l బిఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా గెలుపు కాంగ్రెస్ పార్టీ దే ..

congress l బిఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా గెలుపు కాంగ్రెస్ పార్టీ దే ..

9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వంగాల కళ్యాణి మల్లారెడ్డి

congress l జనగామ, ఆంధ్రప్రభ ; జనగామ మున్సిపల్ ఎన్నికల్లో 9 వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా గెలుపు కాంగ్రెస్ పార్టీ దే అని 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వంగాల కళ్యాణి మల్లారెడ్డి అన్నారు. సోమవారం 9 వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని దీంతో బి ఆర్ ఎస్ నాయకులు ఓర్వలేక కుట్రలకు తెరదీశారని అన్నారు.

దశాబ్దాలుగా 9 వ వార్డుతో తమ కుటుంబానికి అనుబంధం ఉందని ,ఈ ప్రాంత వాసిగా సమస్యలపై అవగాహన ఉందని ఆమె తెలిపారు. వివిధ వార్డుల్లో మూడుసార్లు గెలిచిన అనుభవం తనకుందని దీంతో ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన విజయం తప్పదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి కష్టసుఖాల్లో భాగం పంచుకుంటామని, ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి తగు విధంగా సహాయపడతామని , ప్రభుత్వము నుండి, మున్సిపల్ నుండి చేయవలసిన పనులు వెంటనే చేసేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు .ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply