Congress l మంత్రి మక్తల్ బిడ్డ అభివృద్ధి చేసుకుందాం.. కాంగ్రెస్ ను గెలిపించండి..

Congress l మంత్రి మక్తల్ బిడ్డ అభివృద్ధి చేసుకుందాం.. కాంగ్రెస్ ను గెలిపించండి..
Congress l మక్తల్, ఆంధ్రప్రభ: మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్ ముద్దుబిడ్డ అభివృద్ధి కోసం ఎన్నైనా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో 12 వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీనుండి పోటీ చేస్తున్నా తనను ఆదరించి గెలిపించండి మన ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందాం అని కాంగ్రెస్ పార్టీ 12 వ వార్డు అభ్యర్థి రహీం పటేల్ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ప్రజలకు లేఖ విడుదల చేశారు. గత దశాబ్దాల కాలాన్ని గుర్తించండి ఎంత అభివృద్ధి జరిగిందో అర్థం అవుతుంది. ప్రస్తుతం రెండేళ్లుగా మంత్రి వాకిటి చేస్తున్న అభివృద్ధిని గుర్తించండి అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుంది. 72 ఏళ్లుగా జరగని అభివృద్ధి రెండేళ్లలో ఎంతో జరిగింది వాస్తవాలను గుర్తించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మక్తల్ పట్టణంలో 50 కోట్ల రూపాయలతో 150 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. వందల కోట్ల వ్యయంతో పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కొనసాగుతుంది.
