Congress l 41వ డివిజన్‌లో కాంగ్రెస్ ప్రభంజనం…

Congress l 41వ డివిజన్‌లో కాంగ్రెస్ ప్రభంజనం…
స్వప్న లక్ష్మణ్ యాదవ్ ప్రచారానికి ప్రజల అఖండ మద్దతు,ప్రత్యర్థుల్లో కలవరం
Congress l మహబూబ్ నగర్,ఆంధ్రప్రభ: మహబూబ్ నగర్ 41వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న లక్ష్మణ్ యాదవ్ ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంటింటా సాగుతున్న ముమ్మర ప్రచారానికి కాలనీవాసులు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతూ బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తున్నారు. గెలుపు ఖాయమైన అభ్యర్థికే తమ ఓటు అంటూ ప్రజలు స్పష్టమైన సంకేతాలు ఇస్తుండటంతో డివిజన్‌లో కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహం రెట్టింపైంది. గతంలో చేసిన సేవలను గుర్తు చేస్తూ, మరో అవకాశం ఇస్తే ప్రజల సమస్యల పరిష్కారానికే తన జీవితాన్ని అంకితం చేస్తానని స్వప్న లక్ష్మణ్ యాదవ్ హామీ ఇస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజల నమ్మకమే అజెండాగా సాగుతున్న ఈ ప్రచారం ప్రత్యర్థి వర్గాల్లో కలవరం రేపుతుండగా, 41వ డివిజన్‌లో కాంగ్రెస్ ప్రభంజనం ఖాయమన్న భావన బలపడుతోంది.
