Congratulations | పద్మశ్రీ గ్రహీతలకు అభినందనలు..

Congratulations | పద్మశ్రీ గ్రహీతలకు అభినందనలు..

  • మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ నివాసాల్లో మర్యాదపూర్వక భేటీ

Congratulations | విజయవాడ, ఆంధ్రప్రభ : పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన ప్రముఖ సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లను తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హైదరాబాద్‌లోని వారి వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురికీ పద్మశ్రీ పురస్కారాలు లభించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

తెలుగు సినిమా రంగానికి దశాబ్దాలుగా వారు అందించిన సేవలు, కళారంగంలో వారి పాత్ర చిరస్మరణీయమని బుద్దా వెంకన్న ప్రశంసించారు. ప్రజల మన్ననలు పొందిన నటులుగా మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లు తెలుగు సంస్కృతికి ప్రతీకలుగా నిలిచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరువురిని శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. వారి సినీ ప్రయాణం, సమాజానికి చేసిన సేవలు యువతకు ఆదర్శమని అన్నారు.

పద్మశ్రీ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు తెలుగు ప్రజలకే గర్వకారణమని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. తమ నివాసాల వద్ద బుద్దా వెంకన్నను సాదరంగా ఆహ్వానించిన మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లు కుశల ప్రశ్నలు వేసి, సమకాలీన పరిస్థితులపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం తమకు ప్రకటించిన పద్మశ్రీ అవార్డులు వ్యక్తిగతంగా తమకే కాకుండా తెలుగు సినిమా రంగానికి దక్కిన గౌరవమని వారు అభిప్రాయపడ్డారు.

Leave a Reply