Condolence | విమాన ప్ర‌మాదంపై చంద్ర‌బాబు , రేవంత్, ప‌వ‌న్ క‌ల్యాణ్ విచారం ..

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) , ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ , (Pawan Kalyan) తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) పేర్కొన్నారు. ఈ దురదృష్టకర సంఘటన పట్ల వారు విచారం వ్యక్తం చేశారు.

“అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన చాలా బాధాకరం” అని చంద్రబాబు వివరించారు. ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులు, విమాన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో పాటు, ఈ ఘటన వల్ల ప్రభావితమైన స్థానిక నివాసితుల గురించి తాను ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. బాధిత ప్రయాణికులు, సిబ్బంది, వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. వారందరి కోసం తాము ప్రార్థనలు చేస్తున్నామని, ఈ కష్ట సమయంలో వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

రేవంత్ రెడ్డి …
అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్​ ఇండియా విమానం కూలిపోయిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్​ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో దాదాపు 200 మందికిపైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారనే సమాచారం తెలియటంతో.. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. బాధితులను, వారి కుటుంబాలను ఆదుకోవడానికి వీలైనంత వేగంగా సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఎపి ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్

అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (pawan kalyan) స్పందించారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. “242 మందితో లండన్ బయలుదేరిన విమానం – టేకాఫ్ (Ahmedabad Plane Crash) అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాము. వైద్య కళాశాల వసతి భవనాలపై ( కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ దుర్ఘటనలో మృతులకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇది” అని అయన అన్నారు.

Leave a Reply