పేద ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం..

పేద ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పేద ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ ధర్మ బిక్షమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర సమరయోధులు నల్లగొండ మాజీ పార్లమెంట్ సభ్యులు ధర్మభిక్షం 15 వ వర్ధంతి సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని తంగేడుపల్లి రోడ్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు పర్యాయాలు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరించారని తెలిపారు. రాచకొండ గుట్టల్లో ఏర్పాటు చేయదలచిన ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి రద్దు చేయించిన ఘనత ధర్మ బిక్షందే అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మున్సిపాలిటీ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, ఉడుత రామలింగం, గీత పనివారల సంఘం నాయకులు నీళ్ల బిక్షపతి, కొండూరు వెంకటేష్, టంగుటూరి రాములు, రొండీ నరసింహ, బద్దుల సుధాకర్, రోషన అంజయ్య, దాసరి మనోహర్, కట్టెల లింగస్వామి, దాసరి కృష్ణ, యాదయ్య, నీళ్ళ సంతోష తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా చౌటుప్పల్ పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు చింతకింది అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ థర్మ బిక్షం 15వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.
