complaint | ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీజేపీ అభ్యర్థి పిర్యాదు

complaint | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో పంచదేవ్ పహాడ్ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకుని తిరిగి మక్తల్ మున్సిపాలిటీలో 8వ వార్డులో ఓటు హక్కు కలిగి ఉండి ఒకటవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి రాజ్యాంగాన్ని ఓటు హక్కును దుర్వినియోగపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కట్టా సురేష్ గుప్తా నామినేషన్ లో తిరస్కరించాలని బిజెపి అభ్యర్థి బి. రాజశేఖర్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.

మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డ్ కు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి కట్టా సురేష్ గుప్తా మక్తల్ మండలంలోని పంచదేవపాడు గ్రామంలో 4వ వార్డ్ నందు పోలింగ్ స్టేషన్ నంబర్ 4లో పీఎస్ రూం నెంబర్ 2 లో ప్రాథమిక పాఠశాల యందు s no 139(SJW2241859) గత గ్రామపంచాయతీ ఎన్నికల లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అదేవిధంగా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ బూత్ నంబర్ 18 వార్డ్ నెంబర్ 8లో S NO 497 లొ ఓటు హక్కు కలిగియుండి 1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కును దుర్వినియోగ పరుస్తున్న 1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కట్టా సురేష్ గుప్తా నామినేషన్ను తిరస్కరించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును ఈ విధంగా దుర్వినియోగంచేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కట్టా సురేష్ గుప్తా నామినేషన్ను తిరస్కరించాలని, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన పిర్యదులో డిమాండ్ చేశారు.

Leave a Reply