Competitions | ఆటల పోటీల్లో నారా దేవాన్ష్

Competitions | ఆటల పోటీల్లో నారా దేవాన్ష్

  • మురిసిన తాత చంద్రబాబు

Competitions | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహాణ జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్, లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి, వారి తనయుడు దేవాంశ్, బాలకృష్ణ సతీమణి వసుంధర, తేజస్విని, శ్రీభరత్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ క్రీడా పోటీల్లో దేవాన్ష్ ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఆయా పోటీలను సీఎం, కుటుంబ సభ్యులు కలిసి తిలకించారు. ఆ తర్వాత క్రీడల్లో విజేతలకు చంద్రబాబు, భువనేశ్వరి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

Leave a Reply