Competition | మహిళల అభివృద్దే సమాజం అభివృద్ధి

Competition | మహిళల అభివృద్దే సమాజం అభివృద్ధి

  • నర్సంపేట షీ టీం ఎస్సై స్వాతి

Competition | నర్సంపేట, ఆంధ్రప్రభ : మహిళలు అన్ని రంగాల్లో చురుకుగా పాల్గొంటేనే సమాజం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని.. మహిళల అభివృద్దే సమాజం అభివృద్ధి అని నర్సంపేట షీ టీం ఎస్సై స్వాతి అన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పట్టణం మహేశ్వరం గ్రామంలో అరుణోదయ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్ననాటి మిత్రుడు శశిప్రీతం జ్ఞాపకార్ధంగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సంపేట షీ టీం ఎస్సై స్వాతి మాట్లాడుతూ.. మహిళలు ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొని వాటి పరిష్కారం కోసం ముందడుగు వేయాలని, అలాంటప్పుడే అన్ని రంగాల్లో దీటుగా ఎదుర్కొని పోరాడే తత్వం అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రామ మహిళలకి షీ టీం గూర్చి అవగాహన కల్పించారు.

అనంతరం పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మోర్తాల గోపాల్ రావు, శశిప్రీతం కుటుంబ సభ్యులు కొయ్యడ విజయ, జనప్రియ, సంతోష్, ఉపాధ్యాయులు పెండ్యాల పురుషోత్తం, ఆకారపు కృష్ణమూర్తి, జినుకల నర్సింహారాములు, పోరెడ్డి నర్సిరెడ్డి, మాడుగుల రాజిరెడ్డి, బాబు, పురపాలక సంఘ సిబ్బంది, న్యాయ నిర్ణేతలు, మిత్రులు పాల్గొన్నారు.

Leave a Reply