నష్టపరిహారం చెల్లించాలి..
యాదాద్రి, (ఆంధ్రప్రభ)
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో మోటకొండూరు మండలంలోని తేరాల గ్రామంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి , బిజెపి జిల్లా నాయకులు శేఖర్ రెడ్డి, యెల్లేష్, మల్లేష్, బూత్ అధ్యక్షులు, మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

