committee members | రాములు మృతి సీపీఎం పార్టీకి తీరనిలోటు

committee members | రాములు మృతి సీపీఎం పార్టీకి తీరనిలోటు

committee members | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గూడపూర్ గ్రామానికి చెందిన సీపీఐ(CPI)(ఎం) సీనియర్ నాయకులు మునుగోటి రాములు మృతి పార్టీకి తీరని లోటు అని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. ఈ రోజు రాములు భౌతిక కాయానికి మండల కమిటీ సభ్యుల(committee members)తో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గూడపూర్ గ్రామంలో పలు సమస్యల పైన సీపీఐ ఎం చేపట్టిన ఉద్యమాల(movements)లో రాములు కీలకపాత్ర పోషించే వారని గుర్తు చేశారు. రాములు కుటుంబ సభ్యులకు సీపీఐఎం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ సర్పంచ్ మిర్యాల వెంకటేశ్వర్లు, సీపీఐఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్, మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, కల్వలపల్లి ఉప సర్పంచ్ శివర్ల వీరమల్లు, యాసరాణి శ్రీను, వేముల లింగస్వామి, పగడాల కాంతయ్య, వంటెపాక రమేష్ తదితరులు ఉన్నారు.

Leave a Reply