గ్రామ మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉంటా..

మంథని రూరల్, ఆంధ్రప్రభ : గ్రామ మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఖానాపూర్ గ్రామ సర్పంచ్ సంగెం అరుణ గట్టయ్య పేర్కొన్నారు. ఆదివారం మంథని మండలం ఖానాపూర్ గ్రామం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సంగెం అరుణ గట్టయ్య ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
మహిళలను శాలువాలతో సన్మానించి సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ…. గ్రామ అభివృద్ధికి, గ్రామంలోని మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని తెలిపారు. మహిళల విశిష్టతను కొనియాడారు. ప్రథమ పౌరురాలుగా ఉన్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని తెలిపారు. గ్రామంలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామపంచాయతీ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
