పెన్షన్ టైమ్‌కి అందుతోందా?

పెన్షన్ టైమ్‌కి అందుతోందా?

  • ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులతో
  • కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి

కర్నూలు ప్రతినిధి, ఆంధ్రపభ : అందరూ బాగున్నారా? నెలనెల పెన్షన్(Pension) సకాలంలో అందుతోందా? అని ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులను కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి(Dr. A. Siri) ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలోని 2, 39, 256 మంది ఎన్టీఆర్ భరోసా(NTR Bharosa) లబ్దిదారులకు రూ.103.88 కోట్లు పంపిణీ సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలోని భగత్ సింగ్ నగర్(Bhagat Singh Nagar) వీధిలో ఇంటింటికీ కలెక్టర్ వెళ్లారు. అక్కడి లబ్ధిదారుల యోగక్షేమాలను ఆరా తీశారు.

ఈ సందర్భంగా తమ ప్రాంతంలో విద్యుత్తు వైర్లు(Electricity Wires) కిందికి జారాయని, వర్షం పడితే డ్రెయిన్లు పొంగుతున్నాయని, మురికి కాలువ నీరు రోడ్ మీద చేరుతోందని, దోమలు పెరిగిపోయాయని స్థానికులు కలెక్టర్ కు చెప్పారు. మరి కొంతమంది తమకు పెన్షన్ మంజూరు చేయించాలని కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

అంతక ముందు భగత్ సింగ్ నగర్ వీధిలో షేక్ మాబి(Sheikh Mabi), మౌలా హుస్సేన్, లక్ష్మయ్య, హుస్సేన్ బి(Hussain B), మక్బూల్ లకు వృద్ధాప్య పెన్షన్, ఆశీర్వాదమ్మ, పద్మావతి లకు వితంతువు పెన్షన్, పార్వతి, ఖాజా బీలకు వైకల్య పెన్షన్ లను జిల్లా నేరుగా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, డీఆర్డీయే(DRDA) ప్రాజెక్టు డైరెక్టర్ రమణారెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply