హెచ్ఎంపై ఆగ్రహం

కొండపాక, అక్టోబర్ 23.( ఆంధ్రప్రభ ): దుద్దెడ (Duddeda) జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి (Haimavathi) ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం వంట చేయకపోవడంపై హెచ్ఎం లక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్… సాకులు చెప్పవద్దంటూ హెచ్చరించారు. అనంతరం ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ (Collector) హైమావతి ఏఎన్ఎం స్వరూపురాణి గైర్హాజరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్టార్ లో ఆబ్సెంట్ వేసిన జిల్లా కలెక్టర్… విధులు సక్రమంగా నిర్వహించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు.

Leave a Reply