Collectorate | బాల్య వివాహ రహిత జిల్లాయే లక్ష్యం

Collectorate | బాల్య వివాహ రహిత జిల్లాయే లక్ష్యం
కలెక్టర్ శ్యాంప్రసాద్
Collectorate | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లాను వందశాతం బాల్య వివాహ రహితంగా మార్చేందుకు అధికారులందరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ (A.Shyamprasad) ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా “మిషన్ వాత్సల్య పథకం”లో భాగంగా.. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో బాల్య వివాహ ముక్తభారత్ 100 రోజుల అవగాహన కార్యక్రమం అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహరహిత ప్రచార క్యాంపెయిన్ బ్యానర్ పై కలెక్టర్ సంతకం చేశారు.
అలాగే బాల్య వివాహ ముక్త భారత్ 100 రోజుల క్యాంపెయిన్ సెల్ఫీ పాయింట్‌ను ప్రారంభించారు. సమావేశంలో ఆర్డీఓ (RTO) సువర్ణ, డీఎస్పీ విజయకుమార్, చైల్డ్ ప్రొటెక్షన్ అడోలసెంట్ యూత్ డెవలప్‌మెంట్ అధికారి ఎం.మురళీకృష్ణ, ఐసీడీఎస్ పీడీ ప్రమీల రాణి, డీపీఓ సమత, డీఆర్డీఏ పీడీ నర్సయ్య, బీసీ, సోషల్ వెల్ఫేర్ అధికారులు రాజేంద్రరెడ్డి, రెడ్డి బాలాజీ, డీఈఓ కిష్టప్ప, డీసీహెచ్ఎస్ డాక్టర్ మధుసూదన్, జీఎస్‌డబ్ల్యూఎస్ అధికారి సుధాకర్ రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి హరికృష్ణ, డీసీపీవో మహేష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

