Collectorate | ఐటీడీఏ ఏర్పాటు కోరుతూ ధర్నా…

Collectorate | ఐటీడీఏ ఏర్పాటు కోరుతూ ధర్నా…

Collectorate | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : జిల్లాల విభజనలో ఐటిడిఏ కోల్పోయిన శ్రీకాకుళం జిల్లాకీ నేటికీ ఐదేళ్లు కావస్తున్నప్పటికీ మెళియాపుట్టి కేంద్రంగా ఐటిడిఏ ఎందుకు మంజూరు చేయటం లేదని ఆదివాసీ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగి ప్రభుత్వానికి ప్రశ్నించారు. గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద గురువారం జరిగిన ధర్నాను ఉద్దేశించి యోగి మాట్లాడుతూ… జిల్లాలో నివసిస్తున్న ఆదివాసి జనాభా సుమారుగా రెండు లక్షలు పైబడి నివసిస్తున్నారన్నారు. ఆదివాసీ ల సమస్యలు ఏమైనా ఉంటే సీతంపేట ఐటిడిఎకి వెళ్లి సమస్యలను విన్నవించుకునే వారని, కొత్త జిల్లాలు ఏర్పాటు అయిన తర్వాత సీతంపేట ఐటిడిఎ పార్వతీపురం జిల్లాలో విలీనం అయ్యిందన్నారు.

సీతంపేట ఐటిడిఎ పార్వతీపురం జిల్లాకు విలీనం అవ్వడం ద్వారా ఇక్కడ నివసిస్తున్న ఆదివాసి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఆదివాసి ప్రజలకు కొంతమేరకు అభివృద్ధి జరిగిందంటే అది గిరిజన అభివృద్ధి సంస్థ సీతంపేట ద్వారానే జరిగాయన్నారు.గిరిజన గ్రామాల రోడ్లు గాని, మంచినీరు సదుపాయం, వైద్య సదుపాయం,విద్య, కొండ పోడు, వ్యవసాయాగాని,రుణాలు మంజూరు గాని,ఉద్యోగ ఉపాధి కల్పనలో,పేద గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోడానికి గాని,అన్ని రకాలుగా సీతంపేట గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా జిల్లా ఆదివాసీలకు న్యాయం కొంతమేరకు జరిగిందన్నారు.

సీతంపేట ఐటిడిఎ పార్వతీపురం జిల్లాలోకి విలీనం కావడం ఒకే జిల్లాలో రెండు ఐటీడీఏలు,రెండు డి.డి కార్యాలయాలు ఉన్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నివసిస్తున్న ఆదివాసీలు తీవ్ర నష్టం జరిగిందని,దీనిని దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసులకి అన్యాయం జరగకుండా మెళియాపుట్టి మండల కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఇచ్చాపురం నుండి కొత్తూరు వరకు ఉన్న ఆదివాసీలకు పరిపాలన సౌలభ్యం కోసం మెళియపుట్టి కేంద్రంగా ఐటిడిఏ మంజూరుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు.

ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు స్వయంగా శ్రీకాకుళం జిల్లాకు ఐటిడిఏ కేటాయిస్తామని హామీ ఇచ్చారని,.అధికారంలోకి వచ్చిన 20 నెలల గడుస్తున్న అతి గతి లేదన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మంత్రి అచ్చం నాయుడు మెళియపుట్టి కేంద్రంగా ఐటిడిఏ మంజూరు చేస్తామని ప్రకటన చేశారని,. రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా చొరవ చూపి మెళియాపుట్టి కేంద్రంగా ఐటిడిఏ ఏర్పాటు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆదివాసీల అభివృద్ధి సంక్షేమానికి దోహదపడిన వారు అవుతారన్నారు.

జిల్లాల విభజనలో ఆదివాసీలకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే ఐదు సంవత్సరాలు గతించిందని, ఇప్పటికైనా సత్వరం ఐటిడిఏ ప్రకటన చేయకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమానికి అవసరమైతే పిలుపునిస్తాన్నామని తెలిపారు. ఈ ధర్నాకు సంఘీభావంగా బహుజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు పాటల తూట ఉదయభాస్కర్,అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వంకల మాధవరావు,పాల్గొని సిక్కోలు ఆదివాసీలకు ఐటీడీఏ తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు గురడి.అప్పన్న, కోత. ధర్మరావు, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు, డప్పు రాజు, వెంకటేష్ సర్పంచ్, భాస్కర్ రావు, సర్పంచ్, సింహాచలం, పాపారావు, మిన్నరావు, మహేష్, కువ్వారి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply