RDO|గుడివాడ ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

RDO| గుడివాడ, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం మధ్యాహ్నం గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. వివిధ అంశాలకు సంబంధించిన రిజిస్టర్లు, నెలవారి నివేదికలు, పలు సర్వేల పురోగతి, కార్యాలయంలోని ఖాళీ పోస్టులు తదితర వివరాలపై గుడివాడ ఆర్డిఓను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయన డిస్పాచ్ రిజిస్టర్, పే బిల్, ట్రెజరీ రీకన్సిలేషన్, ట్రెజరీ బిల్ రిజిస్టర్, టూర్ ప్రోగ్రాం, ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, ఆర్ ఓ ఆర్, హౌస్ సైట్స్ తదితర రిజిస్టర్లను స్వయంగా పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ జి బాలసుబ్రహ్మణ్యంతో పాటు కార్యాలయ ఉద్యోగులు ఉన్నారు.

Leave a Reply