హెచ్ఎంను సస్పెండ్ చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశం

హెచ్ఎంను సస్పెండ్ చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశం

సంగారెడ్డి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పారిశుధ్య‌ సమస్యపై కలెక్టర్ ఆగ్రహం
పదో తరగతి ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
ఎఫ్ఆర్ఎస్ ను సక్రమంగా వినియోగించాలి


సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : సంగారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పారిశుద్ధ సమస్యపై కలెక్టర్ పి.ప్రావీణ్య, ప్రధానోపాధ్యాయులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య (Collector P. Praveenya) సంగారెడ్డి బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో శానిటేషన్ సమస్య, ఎఫ్ఆర్ఎస్ ప‌ద్ధ‌తి సరిగా అమలు చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పాఠశాలలో మూత్రశాలలు మరుగుదొడ్లను పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉండడంతో పాటు, పాఠశాలలో శానిటేషన్ సమస్య కలెక్టర్ దృష్టికి రావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని సస్పెన్షన్ చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును ఆదేశించారు. పాఠశాలలో శానిటేషన్ సిబ్బందిని తొలగించి నూతన శానిటేషన్ సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం తరగతి గదులను సందర్శించారు. ఎఫ్ఆర్ఎస్ సిస్టం పూర్తిస్థాయిలో అమలు అయ్యేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.

రానున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద‌ శాతం ఉత్తీర్ణులు అయ్యేలా ఇప్పటి నుండే ఉపాధ్యాయులు, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాల మెరుగుకు టీచ‌ర్లు, సిబ్బంది కృషి చేయాలని ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.

Leave a Reply